యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న చిత్రం “ఆటో నగర్ సూర్య” ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ షెడ్యూల్ లో ఒక పాత రెండు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు . ఈ పాటకు రాజ సుందరం కోరియోగ్రఫీ చేస్తున్నారు. నాగ చైతన్య మరియు దేవ్ కట్ట ఇద్దరు కమర్షియల్ చిత్రం గా మలచాలని ప్రయత్నిస్తున్నారు కథానాయికగా సమంత నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కే.అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.