సీనియర్ నటుడు, నిర్మాత అంతకు మించి గొప్ప దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు ‘పూలరంగడు’ చిత్రాన్ని చిన్న సినిమా విజయం భావిస్తున్నాను అన్నారు. ఇటీవల జరిగిన పూలరంగడు సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం సునీల్ కష్టపడిన తీరు బాగా నచ్చాయని, సినిమాకి ప్రాణం అయిన పతాక సన్నివేశాల్లో సునీల్ తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలాంటి మంచి సినిమాలను నిర్మిస్తున్నందుకు నిర్మాతలను కూడా అభినందించారు. దాసరి చిన్న సినిమా బాగు కోసం ఎంతో కృషి చేసారు. దర్శకుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీసారు. ముఖ్యంగా 1970 నుండి 1980 మధ్యలో ఎన్నో చిన్న సినిమాలు తీసి విజయం సాధించారు.