గౌతం మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం సంగీతాభిమానులకు విందు భోజనంలా రాబోతుంది. రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ప్రముఖ గాయకుడు కార్తీక్ పాటలు పాడారు. ఈ విషయాన్ని గౌతం మీనన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటు ద్వారా తెలిపాడు. ఇళయరాజా గారు ఈ చిత్రం కోసం అధ్బుతమైన స్వరాలూ సమకూర్చినట్లు అవి ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయని అన్నాడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్లో నాని, సమంతా నటిస్తుండగా ఎమ్ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కుతుంది.