శంషాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న రెబల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబల్’ శంషాబాద్ లోని ప్రముఖ గుడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యుల్ తో షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యుల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పని చేస్తున్న మరో టెక్నీషియన్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాల్సి ఉండగా ఆయన తప్పుకోవడంతో లారెన్స్ స్వయంగా సంగీతం అందిస్తున్నాడు. రెబల్ చిత్రాన్ని జే. భగవాన్ మరియు జే. పుల్లారావు నిర్మిస్తున్నారు.

Exit mobile version