సూపర్ స్టార్ మహేష్ బాబు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథానాయకుడయ్యారు. “దూకుడు” మరియు “బిజినెస్ మాన్” చిత్రాల విడుదల తరువాత మహేష్ బాబు పేరు దేశవ్యాప్తంగా తెలిసింది ఈ మధ్యనే ఈ నటుడి త్విత్తర్ లో ఫాలోవర్స్ మూడు లక్షలు దాటారు ఇది చూస్తుంటేనే యువత లో అతనికి ఉన్న క్రేజ్ తెలుస్తుంది. సిని పండితులు మాట్లాడుతూ మహేష్ బాబు మన తెలుగు పరిశ్రమ కి అంతగా ప్రాచుర్యం లేని ప్రదేశాల్లో కూడా తనదయిన శైలిని చూపించారు తమిళ నాడు ,కర్ణాటక మరియు ఉత్తర భారత దేశం లో ఈ నటుడు తన ఉనికిని చాటారు రాబోతున్న చిత్రాలు మరింత మార్కెట్ ని ఇస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం లో నటిస్తున్నారు త్వరలో సుకుమార్ దర్శకత్వం వహించబోతున్న చిత్రం లో కనిపించబోతున్నారు.