పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ కి సంభందించిన మొదటి టీజర్ ఇటీవల విడుదల చేయగా ఫ్యాన్స్ నుండి మరియు మూవీ లవర్స్ నుండి విపరీతమైన స్పందన లభించింది. ఈ టీజర్ సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర విదేశీ పంపిణీ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. విదేశాలలో పవన్ కళ్యాణ్ కి బాగా క్రేజ్ ఉండటంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ హక్కుల కోసం బంపర్ ఆఫర్ అమౌంట్ ను నిర్మాతకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికీ కూడా ఇంకా హక్కులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విపరీతమైన పోటీలో ఎవరు ఆ హక్కులు దక్కించుకుంటారో వేచి చూడాలి. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ అబూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తుండగా గబ్బర్ సింగ్ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాడు.