షాడో మొదటి షెడ్యుల్ పూర్తి


మెహెర్ రమేష్ డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘షాడో’ చిత్రం మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. వెంకటేష్ తో పాటుగా శ్రీకాంత్, తాప్సీ మధురిమ బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తరువాత షెడ్యుల్ మార్చి 6 నుండి ప్రారంభమవుతుంది. వెంకటేష్ ఈ చిత్రంలో డాన్ పాత్ర పోషిస్తుండగా ఈ చిత్రంలో అత్యదిక భాగాన్ని ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్ మరియు గోపి మోహన్ స్క్రిప్ట్ మరియు సంభాషణలు అందిస్తున్నారు.

Exit mobile version