అల్లరి నరేష్ ‘సుడిగాడు’?

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కామెడీ చిత్రానికి ‘సుడిగాడు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. తమిళంలో ‘తమిళ్ పడం’ అనే కామెడీ చిత్రాన్ని రిమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎలాంటి పబ్లిసిటీ మరియు హైప్ లేకుండా దూరంగా ఉంది. ఈ చిత్రం కోసం కొత్త హీరొయిన్ ని తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నిర్మాత కూడా భీమనేని శ్రీనివాస్ రావు కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు భారీ హిట్స్ సాధించిన చిత్రాలన్నింటిని స్పూఫ్ గా ఈ చిత్రంలో చూపించాబోతున్నారు. ఈ ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version