ప్రస్తుతం తెలుగు తమిళ్ రెండు భాషల్లో అగ్ర సంగీత దర్శకుడుగా కొనసాగుతుంది ఎవరు అంటే తమన్. అవును తమన్ తెలుగు మరియు తమిళ భాషల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. కాని సినిమాలు పెరగడంతో ఆయన సంగీతంలో నాణ్యత తగ్గిందనే విమర్శ వినిపిస్తూ వస్తుంది. ఆయన సంగీతంలో సిన్తనైజర్ మరియు డ్రమ్స్ బాగా ఎక్కువగా వాడుతున్నారు అనే విమర్శకూడా ఉంది. అయితే ఈ అపవాదు పోగొట్టుకోనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన చేయబోయే వెంకటేష్ ‘షాడో’ మరియు శ్రీను వైట్ల – ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న చిత్రాల కోసం కొత్త రకమైన వాయిద్యాలు తీసుకున్నట్లు ప్రముఖ స్క్రిప్ట్ రచయిత గోపి మోహన్ తన ట్విట్టర్లో తెలిపాడు. ఇది సంతోషించాల్సిన పరిణామం. ఆ రెండు సినిమాల ఆడియో విడుదలైతే తమన్ తమన్ తన పంథా మర్చుకున్నడా? లేదా? అనేది తెలుస్తుంది.