సునీల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు


ఫిబ్రవరి 28 హస్యనటుడి నుండి కథానాయకుడు గా మారిన సునీల్ పుట్టినరోజు. 1974 లో సునీల్ వర్మ గా పుట్టిన ఈయన ఈరోజుతో 46 వసంతాలు పూర్తి చేసుకున్నారు. తన బాల్యం భీమవరం లో గడిపిన సునీల్ తన ఐదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. డాన్స్ మీద ఉన్న ఆసక్తి చిరంజీవి గారంటే ఉన్న అభిమానం ఆయన్ని సినిమా వైపు వచ్చేలా చేసింది బి.ఏ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసిన సునీల్ డాన్సర్ గా,ఆర్ట్ డైరెక్టర్ గా విలన్ గా కూడా ప్రయత్నించారు కాని “నువ్వే కావాలి” చిత్రం లో అవకాశం వచ్చాక ఇంకా వెను తిరిగి చూడలేదు. పరిశ్రమ లో పెద్ద హాస్యనటుడు అయ్యారు. తరువాత “అందాల రాముడు” చిత్రం తో కథానాయకుడి గా మారిన సునీల్ “మర్యాద రామన్న” మరియు “పూల రంగడు” చిత్రాల విజయం తో మంచి కథానాయకుడు అయ్యాడు.

“నేను ఎప్పుడు హాస్య ప్రధానమయిన పాత్రలే ఎన్నుకుంటాను. హాస్యం నా బలం నేను దానిని వదులు కొను” అని అన్నారు. 123తెలుగు.కాం తరుపున సునీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Exit mobile version