రామ్ చరణ్ కోసం కొత్త లోకేషన్లు వెతుకుతున్న చోటా కె నాయుడు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం యూరప్ లో కొత్త లొకేషన్లని వెతుకున్నాడు. వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా ఒక చిత్రం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ చిత్ర తరువాత షెడ్యుల్ యూరప్ లో జరగనుంది. ఇంత వరకు ఏ చిత్రంలో చూపించని సరికోత్హ లోకేషన్లలో షూటింగ్ జరపాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడు. ఆ బాధ్యతని చోటా కె నాయుడు తీసుకుని స్వయంగా తానే వెళ్లి లొకేషన్లను వెతికే పనిలో పడ్డాడు. చోటా కె నాయుడు కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పేది ఏముంది. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యుల్ హైదరాబాదులో పాత బస్తీలో మెగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.

Exit mobile version