బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొట్టుకోబోతున్న “లవ్లీ” మరియు “నీకు నాకు డాష్ డాష్”

ఆది,శంవి ప్రధాన పాత్రలలో వస్తున్న “లవ్లీ” మరియు తేజ దర్శకత్వం లో రాబోతున్న “నీకు నాకు డాష్ డాష్” చిత్రాలు ఈ మార్చ్ లో ఢీ కొట్టుకోబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు మార్చ్ 23 న విడుదల కానున్నాయి . బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ చిత్రం ప్రేమ కథ చిత్రం గా రూపొందింది ఈ చిత్రాని బి ఏ రాజు నిర్మించారు ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషించారు. నీకు నాకు డాష్ డాష్ చిత్రం గురించి తేజ ఎటువంటి సమాచారం బయటకి రానివ్వలేదు. ఈ చిత్రం గత సంవత్సరం లో మొదలయింది. ఇదిలా ఉండగా మార్చ్ 23 న రానా ,జెనిలియా నటించిన “నా ఇష్టం” చిత్రం కూడా విడుదల కానుంది ఈ మూడు చిత్రాలలో ఏది విజయం సాదిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version