మెగా పవర్ స్టార్ నటించి త్వరలో మన ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మా అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబందించిన హిందీ హక్కులు భారీగా 1 కోటి 50 లక్షలకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మార్చి మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.