సునీల్ మరియు ఇషా చావ్లా జంటగా నటించిన ‘పూలరంగడు’ చిత్రం విడుదలై సక్సెస్ సాధించి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ మరియు ప్లాటినం డిస్క్ వేడుక హైదరాబాదులోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ వేడుకకు దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. దాసరి నారాయరావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల పేర్లు తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో పెట్టడానికే ఇష్టపడుతున్నారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ పెడుతున్నాము అని చెప్పినపుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. సునీల్ కమెడియన్ నుండి హీరో గా మారి సక్సెస్ లు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. అలాగే వీరభద్రం కి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ కి అభినందలు తెలియజేసారు.