తూర్పు గోదావరి జిల్లాలో స్థిరంగా నడుస్తున్న “పూల రంగడు” వసూళ్లు


సునీల్,ఇషాచావ్ల మరియు దేవ్ గిల్ లు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “పూల రంగడు”. ఈ చిత్రం అన్ని చోట్ల స్థిరంగా వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహించారు. తూర్పు గోదారి జిల్లాలో ఈ చిత్రం అద్బుతమయిన వసూళ్లు రాబట్టుతుంది మా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు ఈ ఒక్క జిల్లాలోనే 59 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది ఇంకా ఈ చిత్రం పరుగు మీద 90 లక్షల వరకు రాబట్టచ్చు. ఈ జిల్లలో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ముప్పై లక్షల కు పైగా వసూళ్లు రాబట్టింది ఇది చాలా గొప్ప విషయం ఈ చిత్రం తో సునీల్ మార్కెట్ కూడా బాగా పెరిగింది మాకు తెలిసన సమాచారం ప్రకారం ఒక చిత్రానికి సునీల్ మూడు కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు

Exit mobile version