తెలుగు లో రాబోతున్న “ఎంగేయుం కాదల్”

మరొక తమిళ చిత్రం “ఎంగేయుం కాదల్” ఇప్పుడు తెలుగు లో అనువదించ బడుతుంది. జయం రవి మరియు హన్సిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రభు దేవా దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం తమిళం లో భారి విజయం సాదించింది ఈ చిత్రం మొత్తం పారిస్ లో చిత్రీకరించారు తమిళం లో హన్సిక కి ఇదే తొలి చిత్రం. ఇపుడు నిర్మాతలు తెలుగు లో వారి అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. ” ఎంగేయుం కాదల్ ఇపుడు తెలుగు లో రాబోతుంది రాబోయే వారం లో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. విడుదల తేదిని ఖ్రరయ్యాక తెలియ జేస్తా” అని జయం రవి ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితం తెలియ జేసారు

Exit mobile version