ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా బాగా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు తమన్ అని. తమన్ చాలా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే తమన్ తమన్ తన దగ్గరి స్నేహితులు రంజిత్, రాహుల్ నంబియార్ మరియు నవీన్ మాధవ్ తో కలిసి కలిసి కొత్త బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. వారి కొత్త బ్యాండ్ కి ‘తక్కాళి’ (టమాటో) అనే పేరు ఖరారు చేసారు. ఈ బ్యాండ్ ని ఈ వేసవిలో ప్రారంబించనున్నారు. తమన్ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ మేము ఎన్నో సినిమాలకి పని చేస్తున్నాం, ఈ బ్యాండ్ సినిమాలకి కాకుండా ప్రైవేట్ ఆల్బం కి పని చేస్తునది అని చెప్పాడు. ఈ బ్యాండ్ కోసం ఇప్పటికే ఒక పాటని కూడా రికార్డు చేయడం జరిగింది. మరో మూడు పాటల్ని రికార్డు చేయాల్సి ఉంది అన్నారు. ప్రస్తుతం తమన్ వివి వినాయక్ తో కలిసి రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ నటించనున్న సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఊటీ వెళ్లారు.