రానా ‘నా ఇష్టం’ షూటింగ్ పూర్తి

యువ నటుడు దగ్గుపాటి రానా ‘నా ఇష్టం’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలోని చివరి పాటను మలేషియాలో చిత్రీకరించారు. ఈ పాట ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ పాటగా చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో అధికారికంగా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 23 న విడుదలకు సిద్ధమవుతుంది. జెనీలియా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానా స్వార్ధపరుడైన గణేష్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి కిరీటి నిర్మాత. చక్రి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version