యమ ధర్మ రాజు పాత్రని హాస్య భరితంగా మలచడంలో టాలీవుడ్ పెట్టింది పేరు. మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడో ఎవరికీ తెలియదు. కాని యమపురి అని ఒలాటి ఉంటుందనీ, యమ ధర్మ రాజు పాపాలు చేసిన వారికి అక్కడే శిక్షలు విధిస్తారని మన దర్శకులు చాలా సినిమాల్లో చూపించారు. యమ ధర్మ రాజు పాత్రలో మన సీనియర్ నటులు పోషించి మెప్పించారు. వారిలో ‘యమగోల’ చిత్రంలో సత్యనారాయణ, ‘యమదొంగ’ చిత్రంలో మోహన్ బాబు ఆ పాత్రలు పోహించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడే ఇదే తరహా పాత్రని శ్రీహరి పోషించబోతున్నారు.
సాయి రామ్ శంకర్ మరియు పార్వతి మెల్టన్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘యమహొ యమ’ చిత్రంలో శ్రీహరి యమ ధర్మ రాజు పాత్ర పోషించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారు.