
ఇది సాధ్యపడితే ఇండియన్ సినిమా దగ్గర ఈ మధ్య కాలంలో ఒక ఐకానిక్ మల్టీస్టారర్ అనిపించుకునే కాంబినేషన్ నే సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే కమల్ హాసన్ ల కలయిక అని చెప్పాలి. జస్ట్ బజ్ తోనే గట్టి హైప్ ని సొంతం చేసుకున్న ఈ కాంబినేషన్ ని నడిపించే దర్శకుడు ఎవరు అనేది ప్రశ్నగా మారింది.
అయితే ఫైనల్ గా అందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపంలో సమాధానం దొరికినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా ఇప్పుడు మరో లేటెస్ట్ డెవలప్మెంట్ వినిపిస్తోంది. దీని ప్రకారం నెల్సన్ దాదాపు ఖరారు కాగా తను ఈ సినిమాని జైలర్ 2 ఫినిష్ చేసిన వెంటనే ఉంటుంది అన్నట్టు టాక్. అలాగే వచ్చే ఏడాది మధ్య లో నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ కూడా రెడీ చేస్తున్నట్టు ఇప్పుడు టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.