తుఫాన్ గా రాబోతున్న రామ్ చరణ్

ramcharan-zanjeer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. నాలుగు దశాబ్దాల కిందట అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రానికి రీమేక్ ఇది. తాజా ‘జంజీర్’ లో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. రామ్ చరణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అపూర్వ లిఖియా దర్శకుడు, తెలుగు వెర్షన్ యోగి (చింతకాయల రవి డైరెక్టర్) పర్యవేక్షణలో జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ తెలుగు వెర్షన్ టైటిల్ పేరు జ్వాల అని అనేక ప్రచారాలు జరిగాయి. కానీ అధికారికంగా ఈ సినిమాకి ‘తుఫాన్’ అన్న పేరుని ఖరారు చేసినట్టు సమాచారం. సంజయ్ దత్ హిందీ వెర్షన్ లో షేర్ ఖాన్ గా కనిపిస్తుండగా తెలుగులో ఆ పాత్రని శ్రీ హరి పోషిస్తున్నాడు. ఈ సినిమా వేసవి చివర్లో విడుదల కావచ్చు.

Exit mobile version