రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల నడుమ జరుగుతున్న హై డ్రామా నేపధ్యంలో ఈ సెగ మన టాలీవుడ్ కు సైతం సాకింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 31కి విడుదల చేద్దామనుకున్నారు, అయితే ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఆగష్టు 2న తమ నిర్ణయం తెలిపే ఆస్కారం వున్న కారణాన ఆ తేదిలలో గొడవల జరిగే అవకాశం వుంది కనుక ఈ సినిమాను సేఫ్ డేట్ కు వాయిదా వేసారు. ఈ సినిమాను చిరంజీవి పుట్ట్టినరోజు కానుకగా ఆగష్టు 21న విడుదల చేస్తామని తెలిపారు. శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.