రామ్ చరణ్ ‘ఎవడు’కి ‘ఎ’ సర్టిఫికేట్

Yevadu1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము విన్నదాని ప్రకారం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కట్స్ విధించలేదు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version