వెంకీ ‘నారప్ప’లో మరో హీరోయిన్ ?

వెంకీ ‘నారప్ప’లో మరో హీరోయిన్ ?

Published on Feb 1, 2020 1:00 AM IST

విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్‌ షూటింగ్‌ లాస్ట్ వీక్ అనంత‌పురం జిల్లాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం హీరోయిన్ అమలా పాల్ ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని రివీల్‌ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది.

మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,

తాజా వార్తలు