టాలీవుడ్ లో హీరో కోసం చూస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్

టాలీవుడ్ లో హీరో కోసం చూస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్

Published on Aug 31, 2013 6:41 PM IST

yash_raj_films

దేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు తెలుగులోని అడుగుపెట్టనుంది. తెలుగులో వారు తీయనున్న సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని ఈ నిర్మాణ సంస్థ తెలియజేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా నవతరం కథతో యంగ్ హీరోలను పరిచయం చేస్తూ సినిమా తీయాలని చూస్తున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం.
ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తమిళంలో నాని హీరోగా నటిస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉంది. ‘బ్యాండ్ బాజా భారత్’ రీమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో రానున్న మొదటి తెలుగు సినిమాకి సంబందించిన వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఈ ఫేమస్ బ్యానర్ మొదటిసారిగా తెలుగులో నిర్మిస్తున్న సినిమాలో ఎవరు హీరోగా నటించనున్నారు? తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వేచిచూడాలి.

తాజా వార్తలు