కెజిఎఫ్ హీరో యష్ సోషల్ మీడియా వేదికగా ఓ సందేశం పంచుకున్నారు. కెజిఎఫ్ గురించి ఆయన ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. స్టార్ మాలో ఈ ఆదివారం అనగా జులై 5న కెజిఎఫ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ చూసి అందరూ ఆనందించాల్సిదిగా ఆయన తెలియజేశారు. ఆయన ఈ సందేశం తెలుగులో చెప్పడం విశేషం. ఇక కెజిఎఫ్ మూవీ మీకు గొప్ప అనుభూతిని పంచుతుంది అని తెలిపారు.
కెజిఎఫ్ 2 చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 20 రోజుల షూట్ మిగిలివుందని హీరో యష్ చెప్పారు. మొదటి పార్ట్ కి మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా..సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కీలకపాత్ర చేస్తున్నారు. కెజిఎఫ్ 2 అక్టోబర్ 23న విడుదల కానుంది.
https://twitter.com/TheNameIsYash/status/1278994503043395588