కొన్ని నెలల క్రితం హాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన ఎస్.వి కృష్ణారెడ్డి ఇప్పుడు యమలీల సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో వున్నాడు. 1994లో విడుదలైన యమలీల సినిమాలో ఆలీ, ఇంద్రజ నటించారు. 90వ దశకంలో వచ్చిన సినిమాలలో ఈ చిత్రం ఘనా విజయం సాధించి మన ఎస్వీ ని అగ్రస్థానంలో నిలిపింది
ఈ యమలీల 2 కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. గతకొన్ని సంవత్సరాలుగా యముడి ముఖ్యపాత్రలో చాలా సినిమాలు వస్తున్నాయి. మరి ఎస్.వి కృష్ణారెడ్డి ఎటువంటి కాన్సెప్ట్ వస్తాడో చూడాలి