పాటల రచయిత చంద్రబోస్ తెలుగు సినిమా రంగంలో రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకి పాటలు రాసిన చంద్రబోస్ ప్రస్తుతం యువతరం స్టార్ హీరోల సినిమాలకి కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని అందిస్తున్నాడు. ఇప్పుడు పాపులర్ రచయితగా పేరున్న చంద్రబోస్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటివరకూ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఆకలి బాధని ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? అని అడిగితే ‘ చదువుకునే రోజుల్లో డబ్బులకి ఇబ్బంది ఉండేది. కనీసం కడుపునిండా ఇడ్లీలు తిందామన్నా డబ్బులు ఉండేవి కాదు. దాంతో అప్పట్లో దేశానికి ప్రధాన మంత్రి అయిపోయాలి అనుకునే వాన్ని.. ఎందుకంటే అప్పుడైతే రోజుకి యాభై ఇడ్లీలు తినొచ్చని’ అలా అనుకునే వాన్నని చంద్రబోస్ అన్నాడు. తాజాగా చంద్రబోస్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమాకి అన్ని పాటలు చంద్రబోస్ రాసాడు. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.