అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న విజయ్

అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న విజయ్

Published on Feb 11, 2020 10:47 AM IST

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీపై యూత్ లో మహా క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఒక్క హైదరాబాద్ సిటీ నందు 190 షోలకు గాను బుక్ మై షో నందు ఇప్పటికే 120 షోలు ఫుల్ అయిపోయాయి. ఇంకా మిగిలిన షోస్ కూడా త్వరితగతిన బుకింగ్స్ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రంలోని పాటలు, టీజర్స్ మరియు ట్రైలర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

నలుగురు అమ్మాయిలతో వివిధ నేపధ్యాలతో విజయ్ రొమాన్స్ జరుపుతున్నాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఇక రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్యరాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

తాజా వార్తలు