ప్రేమకథలపై ఫోకస్ పెట్టిన థమన్

Thaman
ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో గల మ్యూజిక్ డైరెక్టర్ లలో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ఒకరు. తను ఒక సినిమా తరువాత మరో సినిమాకి గ్యాప్ లేకుండా మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. థమన్ చక్కని మాస్ మ్యూజిక్ ని అందించగలడు అని మనకు తెలుసు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే థమన్ కి మెలోడి మ్యూజిక్ అంటే ఇష్టం. ఈ విషయాన్ని ‘సితార’కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. ‘ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కానీసం రెండు రొమాంటిక్ సినిమాలకైన సంగీతాన్ని అందిస్తాడు. ఈ సినిమాలో అతను మెలోడి సంగీతాన్ని అందించేదాన్ని బట్టి అతనికి మంచి అవకాశాలు వస్తాయి. కేవలం మెలోడి సంగీతం మాత్రమే అతనికి పేరు, విలువని పెంచుతుంది. ఇప్పటి నుండి నేను ఎక్కువగా ప్రేమ కథ సినిమాలపై ఫోకస్ చేస్తాను’ అని అన్నాడు.
ప్రస్తుతం థమన్ ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రేస్ గుర్రం’ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే ‘ఆగడు’ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నాడు.

Exit mobile version