నార్త్ లో ‘అఖండ 2’ ఛాలెంజ్ అధిగమిస్తుందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. ఈసారి తాండవంగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాబోతుంది. మేకర్స్ ఉత్తర భారతంలో కూడా ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ అక్కడ నుంచే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు అఖండ 2 కి అక్కడ బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ పోటీగా ఉంది. ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే వస్తుండడంతో నార్త్ లో అఖండ కి గట్టి పోటీ తప్పలేదు.

పార్ట్ 1 కి నార్త్ ఆడియెన్స్ లో ఓటిటిలోకి వచ్చాక సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పార్ట్ 2 కి గట్టి ప్లానింగ్ నే చేసుకున్నారు. కానీ దురంధర్ రూపంలో వచ్చిన పోటీ, పైగా ఆ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో హిందీలో అఖండ 2 పై మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి దీనిని కూడా అధిగమించి రన్ అయితే మాత్రం అది తాండవమే అని చెప్పాలి.

Exit mobile version