బోల్ బచ్చన్ రీమేక్ లో వెంకటేష్ కి జోడి ఎవరు?

venkatesh
అజయ్ దేవగన్ మరియు అభిషేక్ బచ్చన్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన “బోల్ బచ్చన్” త్వరలో తెలుగులోకి అనువదించబడుతుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ పాత్రను రామ్ పోషించనున్నారు. వెంకటేష్, అజయ్ దేవగన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. స్రవంతి రవికిషోర్ మరియు సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశల్లోనే ఉంది కాని అందరి ప్రశ్న ఒక్కటే ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కనిపించబోతున్న కథానాయిక ఎవరు. కథ ప్రకారం వెంకటేష్ పాత్ర రామ్ చెల్లెలిని ప్రేమించాలి అలానే వెంకటేష్ చెల్లెలు రామ్ ని ప్రేమించాలి. వెంకటేష్ సరసన నటించే కథానాయిక ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న ఎందుకంటే యువ హీరో రామ్ కి చెల్లెలిగా కూడా నటించాలి కాబట్టి. గత ఏడాది వెంకటేష్ మరదలి పాత్ర కోసం బాగా వెతికిన తరువాత “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో అంజలి చేత ఆ పాత్ర చేయించారు. ఈ చిత్రంలో కూడా అంజలి మంచి ఆప్షన్ లానే కనిపిస్తుంది. మరి ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఎవరు అన్న విషయం త్వరలో తెలుస్తుంది.

Exit mobile version