బహుశా అన్నా చెల్లెలు సంభందం కంటే మధురమైన సంభందం మరొకటి ఉండదేమో. చెల్లెలు సెంటిమెంట్ కి తెలుగు వారు అమితమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మధురమైన బందం మీద సినిమాలు కూడా తీశారు. సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రక్త సంభందం’, నాగేశ్వర రావు నటించిన ‘బంగారు గాజులు’ మరియు కృష్ణ నటించిన ‘పుట్టినిల్లు – మెట్టినిల్లు’ చిత్రాలు అప్పట్లో విడుదలై మంచి విజయాల్ని సాదించాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’, మహేష్ బాబు ‘అర్జున్’ మరియు ఎన్.టి.ఆర్ ‘రాఖీ’ చిత్రాలు తప్ప సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమాలు పెద్దగా రావటం లేదు.
ప్రస్తుతం ఉన్న జెనరేషన్ కి పూర్తి సెంటిమెంట్ ఉన్న చిత్రాలు తీస్తే నచ్చడంలేదు మరియు విజయాలు కూడా సాదించడం లేదు. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాదించాలంటే పూర్తి కమర్షియల్ విలువలతో కూడిన కామెడీ మరియు మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలు తీయాలి. ఇప్పుడు కూడా సిస్టర్ సెంటిమెంట్ జోడించిన సినిమాలు చూడటానికి బాగుంటాయి, అందువల్ల ఇప్పటి యంగ్ జెనరేషన్ కి కూడా ఆ రిలేషన్ లో వున్న ప్రేమ, ఆప్యాయతలు తెలుస్తాయి. ప్రజల్లో కూడా ఇది ఈ మధ్య చాలా అరుదుగా కనపడుతోంది.