దుష్ప్రచారమే చరణ్ సినిమా ఫలితాన్ని దెబ్బతీసిందా..?

2019 కి సంక్రాంతి విడుదలైన భారీ చిత్రాలతో వినయ విధేయ రామ ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఇది. ట్రైలర్ టీజర్స్ ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఐతే విడుదలతరువాత సినిమా ఫలితం నెగెటివ్ గా వచ్చింది. మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రం లాంగ్ రన్ లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీవ్ర విమర్శలకు గురి అయ్యాయి. ఐతే ఈ మూవీ బుల్లితెరపై మాత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది.

ఈ చిత్రం ప్రసారమైన ప్రతిసారి మంచి టీఆర్పీ దక్కించుకుంటుంది. ఈ మధ్య ఈ చిత్రం మరో మారు ప్రసారం కాగా భారీ టీఆర్పీ దక్కించుకుంది. దీనితో ఈ మూవీపై జరిగిన దుష్ప్రచారమే ఈ మూవీ ఫలితాన్ని బాక్సా ఫీస్ వద్ద ఫలితాన్ని దెబ్బతీసిందని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటించగా, హీరో ప్రశాంత్, స్నేహ వంటి వారు కీలక రోల్స్ చేశారు.

Exit mobile version