బాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన అవైటెడ్ చిత్రమే “వార్ 2”. హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ మంచి హైప్ నడుమ విడుదల అయ్యి అసలు టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతుంది.
ముఖ్యంగా హిందీ సహా తెలుగులో వార్ 2 సత్తా చాటుతుంది. ఇలా వర్కింగ్ డే విడుదల అయ్యిన ఈ సినిమా నెక్స్ట్ ఆగష్టు 15 హాలిడే కి సాలిడ్ జంప్ అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిందీ నెట్ లో ఏకంగా 55 శాతం జంప్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది.
ఇలా డే 2 కి గాను ఏకంగా 45 కోట్ల నెట్ వసూళ్లు ఈ సినిమా అందుకున్నట్టు టాక్. మొత్తానికి మాత్రం వార్ 2 టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఉతుకుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు అయాన్ ముఖర్జీ పని చేయగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.