ఇంట్రెస్టింగ్.. నార్త్ లో స్టడీ వసూళ్లతో ‘వార్ 2’!

ఇంట్రెస్టింగ్.. నార్త్ లో స్టడీ వసూళ్లతో ‘వార్ 2’!

Published on Aug 20, 2025 5:58 PM IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం కొంచెం డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా కొల్లగొట్టి దుమ్ము లేపింది.

అయితే మిగతా భాషల్లో ఏమో కానీ హిందీలో మాత్రం వార్ 2 మంచి వసూళ్లు రాబడుతుంది. హిందీలో మరీ భారీ ఓపెనింగ్స్ అందుకోలేదు అలాగని తక్కువ పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమా చేయడం లేదు. ఇంట్రెస్టింగ్ గా వీక్ డేస్ లో వచ్చినప్పటికీ వార్ 2 స్టడీగా కొనసాగుతుండడం విశేషం.

ఇలా మొన్న సోమవారం ఏడున్నర కోట్ల నెట్ వసూళ్లు అందుకుంటే నిన్న మంగళవారం మాత్రం కొంచెం పెరిగి ఎనిమిదిన్నర కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. దీనితో హిందీలో మాత్రం వార్ 2 సాలిడ్ పెర్ఫామెన్స్ ని చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇదే రన్ కంటిన్యూ అయితే ఫైనల్ రన్ లో బెటర్ రిజల్ట్ దగ్గర ఈ సినిమా ఆగుతుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు