ఖరారైన విశ్వరూపం డి.టి.హెచ్ రిలీజ్ డేట్

Vishwaroopam

కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా డి.టి.హెచ్ రిలీజ్ పై జరుగుతున్న వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి వారాంతంలో అనగా ఫిబ్రవరి 2న డి.టి.హెచ్ లో వేయనున్నారు. అలాగే ఈ సినిమాని హిందీలో ఒక వారం ఆలస్యంగా ఫిబ్రవరి 1న రిలీజ్ అవుతోంది. కానీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేరోజు (ఫిబ్రవరి 2)న వేయనున్నారు. మా డి.టి.హెచ్ పార్టనర్స్ ఎవరెవరు అనేది త్వరలోనే తెలియజేస్తాము. మేము ఆ షో కోసం మూడు టైమింగ్స్ ఇస్తున్నాం, ఇందులో వీక్షకులు ఎక్కువగా ఏ టైంని సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంలో షో ఉంటుంది.

ముందుగా షో కోసం అనుకున్న రేటుని కూడా తగ్గించారు. అలాగే ఇది వరకే షో కి డబ్బులు కట్టిన వారికి ఆయా డి.టి.హెచ్ కంపెనీ వాళ్ళు వెనక్కి ఇస్తారు, లేదంటే అది మీ ప్రీపెయిడ్ అకౌంట్ కో కూడా మార్పు చేయించుకోవచ్చు. ఈ విషయాన్ని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వారు అధికారికంగా ప్రకటించారు.

Exit mobile version