విడుదలకు సిద్దమవుతున్న విశ్వరూపం 2

విడుదలకు సిద్దమవుతున్న విశ్వరూపం 2

Published on Feb 10, 2014 10:33 PM IST

Vishwaroopam

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు వచ్చాయి. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ కాపీ కూడా సిద్దమవుతుంది. ఈ సినిమాకి కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా కమల్ హాసన్ ఏ డీల్ చేసాడు.

ఇండియాలోని పలు ప్రదేశాల్లో గ్రాండ్ గా షూట్ చేసిన ఈ సినిమాలో గ్లోబల్ టెర్రరిజం గురించి ప్రస్తావించారు. పూజ కుమార్, ఆండ్రియా జేరేమియా, వహీదా రెహ్మాన్, రాహుల్ బోస్ లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ఘిబ్రహ్ సంగీతం అందించగా శాందత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

తాజా వార్తలు