హైదరాబాద్లో విష్ణుమంచు సినిమా షూటింగ్

Vishnuvardhan-Viranica-2
విష్ణు మంచు ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలైంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను తిరుపతిలో షూట్ చేశారు. ఒక చిన్న విరామం తరువాత రెండవ షెడ్యూల్ షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్లో జరుగనుంది. ఈ విరామంలో విష్ణు మంచు తిరుపతిలో విద్యానీకేతన్ అన్వల్ వేడుకలో పాల్గొన్నారు. ఈయన రేపటి నుండి ఈ చిత్ర బృందంతో కలసి హైదరాబాద్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపతి(అందాల రాక్షసి ఫేం) హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మిస్తున్నాడు.

Exit mobile version