ఆగష్టు 30న విడుదలకానున్న విశాల్ సినిమా ఆడియో

Vishal
వరుస ఫ్లాపులతోతన ప్రయాణం కొనసాగిస్తున్న విశాల్ తన తదుపరి సినిమా ‘నటరాజు తానే రాజు’లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతను హీరోనే కాక నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టాడు. ఈ సినిమా టైటిల్ తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో పెట్టినట్టు కనిపిస్తుంది. తమిళ్ లో సినిమా పేరు ‘మధ గజ రాజా’. తమిళనాడులో ప్రముఖ డైరెక్టర్లలో ఒకడైన సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే ఈమధ్య షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సెప్టెంబర్ మొదటివారంలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఆగష్టు 30న ఈ తెలుగు వెర్షన్ ఆడియోను విడుదలచెయ్యనున్నారు. ఈ మధ్యకాలంలో మంచి సంగీతాన్ని అందించిన విజయ్ అంటోనీ ఈ సినిమాకు సంగీతదర్శకుడు. స్నేహ బంధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని సాధిస్తుందని అంచనా

అంజలి ఈ సినిమాలో హీరోయిన్. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఈ సినిమాలో మరో హీరోయిన్. విశాల్ ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఈ సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం

Exit mobile version