పల్నాడు గా సిద్ధమవుతున్న విశాల్

Palnadu-Vishal
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్ మార్కెట్ లో స్థానం సంపాదించుకోగలిగిన నటులలో విశాల్ ఒకడు. తన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. కాకపోతే అతనికి గత కొన్ని సినిమాలనుండి విజయలక్ష్మి వరించడంలేదు. ఈ సమయంలో అతనికి ఒక హిట్ తప్పనిసరి

ప్రస్తుతం విశాల్ దీపావళి సందర్భంగా ‘పల్నాడు’ సినిమాను విడుదలచేసే పనిలో వున్నాడు. గతంలో ‘నా పేరు శివ’ తీసిన సుశీంద్రన్ ఈ కినేమాకు దర్శకుడు. అతని పూర్వపు సినిమా ‘ఆధాలాల్ కాదల్ సైవీర్’ సినిమా విజయం సాదించడంతో ఆనందంలో ఉన్న అతను తెలుగులోకి కూడా అనువదించనున్నాడు. ఈ ‘పల్నాడు’ సినిమాను విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ ‘విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ’ ద్వారా విడుదలచేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది

ఈ సినిమాలో లక్ష్మి మీనన్ హీరోయిన్. డి. ఇమామ్ సంగీతాన్ని అందించాడు. శశాంక్ వెన్నలకంటి మాటలు, సాహితి పాటలు తెలుగు వర్షన్ లో మనం వినచ్చు

Exit mobile version