డైరెక్టర్ వి.వి వినాయక్ అంటే అందరూ చెప్పే మాట మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అలాగే ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అంటే కూడా తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకటే ఒక పక్క డైరెక్ట్ తెలుగు సినిమాలతో, మరో పక్క డబ్బింగ్ సినిమాలతో గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ పై దాడి చేస్తున్న ఏకైక నిర్మాత బెల్లంకొండ సురేష్. ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా పరిచయం కానున్నాడు. నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ నా మిత్రుడు మరియు నా ఆప్తుడు అయిన వినాయక్ చేతుల మీదుగా శ్రీనివాస్ ని లాంచ్ చేయనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా 2013 ఫిబ్రవరిలో మొదలవుతుందని’ అన్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.