
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “బైసన్”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ధృవ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా 70 కోట్లకి పైగా రాబట్టి తమిళ నాట మరో హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమాని దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచే ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా తమిళ్, తెలుగు సహా ఇతర భాషల్లో కూడా వచ్చింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా రంజిత్, అదితి ఆనంద్ లు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి