అలనాటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఓ చోట చేరారే..!

సహజనటి జయసుధ కుమారుడు పెళ్ళి రిసెప్షన్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు నటీనటులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. కేవలం టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన ప్రముఖ తారలు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐతే ఈ పెళ్ళిలో 80-90 లలో హీరోయిన్స్ గా ఓ వెలుగువెలిగిన ప్రముఖ హీరోయిన్స్ మొత్తం ఓ చోటు చేరి సందడి చేశారు.

భానుప్రియ, సుమలత, నదియా, రమ్య కృష్ణ, కుష్బూ, జీవిత రాజశేఖర్ తో పాటు మరికొందరు హీరోయిన్స్ కలిసి ఫోటోకి పోజిచ్చారు. జయ సుధ గారి కొడుకు పెళ్లి వేడుక ఇలా వాళ్లందరి రీ యూనియన్ కి కారణమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version