చికిత్స పొందుతున్న విలక్షణ దర్శకుడు బాపు.!

bapu
తన కుంచెతో చిత్రకళకి రంగులు దిద్దిన చిత్రకారుడు, విలక్షణ దర్శకుడు బాపు గారు అనారోగ్యం వల్ల ఆసుపత్రి పాలయ్యారు. రెండురోజుల క్రితమే భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ ఇచ్చి సత్కరించనుందని తెలిపింది. అది తెలిసి ఎంతోమంది జర్నలిస్ట్ లు, పలువురు సినిమా ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు ఎంతో ఆనందానికి గురైన బాపు గారు ఆరోగ్యం కొంత అసౌకర్యానికి గురైతే హైదరాబాద్లోనే ఓ హాస్పిటల్లో చేర్చారు. బాపు గారి తమ్ముడు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థతి బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. బాపు గారు ‘శ్రీ రామరాజ్యం’, ‘పెళ్లి పుస్తకం’, ‘ముత్యాల ముగ్గు’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

Exit mobile version