విక్టరీ వెంకటేష్ మరియు అంజలి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో జంటగా అలరించారు. మరోసారి వీరిద్దరూ ‘మసాలా’ సినిమాలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ సెప్టెంబర్ 3 నుండి ఒక పాట చిత్రీకరణ కోసం జపాన్ వెళ్లనున్నారు. అందమైన లొకేషన్లకు జపాన్ దేశం పెట్టింది పేరు
ఈ మల్టీ స్టారర్ లో రామ్ మరో హీరో. షాజన్ పదాంసి అతని జోడి. థమన్ అందించిన సంగీతం త్వరలో విడుదలకానుంది. కె విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ .మరియు సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’ కు రీమేక్