విక్టరీ వెంకటేష్ పూర్తి స్టైలిష్ అవతారంలో చాలా కాలం తర్వాత చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకీ హెయిర్ స్టైల్, లుక్ అన్నీ కొత్తగా ఉండనున్నాయి. ఈ సినిమాలోని తన పాత్ర గురించి వెంకీ మాట్లాడుతూ ‘నేను కొత్తదనం ట్రై చేసిన ప్రతి సారీ ప్రేక్షకులు నన్ను అభినందిస్తూ సినిమాని విజయవంతం చేస్తున్నారు. ఈ సినిమాతో అది మరోసారి రిపీట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సారి ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో మీ ముందు కొస్తున్నానని’ అన్నారు.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ కాగా శ్రీ కాంత్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.