పవర్ స్టార్ టైటిల్ తో ఆర్ జి వి మూవీ..!

నెలకొక మూవీతో ముందుకు వెళుతున్న వర్మ…మరో కాంట్రవర్సియల్ ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఆయన పవర్ స్టార్ అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే ఆ మూవీ హీరో పాత్ర యొక్క ఫీచర్స్ తెలియజేస్తూ…కొందరు నటుల పేర్లు ముక్త సరిగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని కాంట్రవర్సియల్ ప్రాజెక్ట్స్ ప్రకటించిన వర్మ మరో వివాదానికి తెరలేపుతున్నట్లు తెలుస్తుంది.

ఇక నిన్న ఆయన విడుదల చేసిన నగ్నం మూవీ బాడ్ రివ్యూలు తెచ్చుకుంది.ఐనప్పటికీ ఆ మూవీ ద్వారా భారీ లాభాలు పొందినట్లు వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. క్లైమాక్స్ మూవీకి 100 రూపాయలు ఒకసారి చూడడానికి వసూలు చేసిన వర్మ ఆ ధరను నగ్నం కోసం 200 రూపాయలకు పెంచాడు. మొత్తంగా వర్మ కాంట్రవర్సి సబ్జెక్టులు మరియు అడల్ట్ కంటెంట్ సినిమాలతో డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు.

Exit mobile version