సినిమాకు ప్రచారం చెయ్యడం అనే విషయంలో ఈ మధ్య టాలీవుడ్ బృందం బాలీవుడ్ ను అనుసరిస్తుంది. చాలా మంది నిర్మాతలు పబ్లిసిటీని ముఖ్యమైన అంశంగా తీసుకుంటున్నారు. ఇదే ధోరణిలో ఇప్పుడు రామ్ – వెంకటేష్ కలిపి నటిస్తున్న ‘బోల్ బచ్చన్’ రీమేక్ సినిమా ప్రచారం కూడా జరగనుంది. సోషల్ మీడియా ప్రేక్షకులకు ‘వైవా’ అనే లఘు చిత్రం ద్వారా పరిచయస్తుడైన హర్ష చీముడు ఇప్పుడు అతని లఘు చిత్రంలో విద్యార్ధులను ప్రశ్నలను అడిగినట్టే రామ్ మరియు వెంకటేష్ లను కొన్ని ప్రశ్నలను అడగబోతున్నాడు. ఈ విధంగా ఈ సినిమాకు యూ ట్యూబ్ లో మంచి ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు
ఈ మల్టీ స్టారర్ సినిమాకు ‘మసాలా’ అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. అంజలి మరియు షాజాన్ పదాంసీ హీరోయిన్స్. కె విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ మరియు సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ నెల విడుదలకావాల్సిన ఈ సినిమా ఆడియో కొన్ని కారణాలవల్ల వాయిదాపడింది
మన తెలుగు సినిమాలకు కూడా ఈ విధంగా ప్రచారం చెయ్యడం ఆనందకరమైన విషయం. ఇదిలాగే కొనసాగితే ఈ ప్రయత్నంలో మరికొన్ని కొత్త ప్రచార మార్గాలను రుపొందించే అవకాశాలు వున్నాయి