పూణేలో చిత్రీకరణ జరుపుకోనున్న “వారధి”


ప్రభాస్ ప్రధాన పాత్రలో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతూ ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి “వారధి” అన్న పేరుని పరిశీలిస్తున్నారు. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయలు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించనున్నారు. గతేడాది డిసెంబర్లో ఈ చిత్రం మొదలయ్యింది. కాని ప్రభాస్ “రెబెల్” చిత్రాన్ని పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టారు. ఈ మధ్యనే “రెబల్” చిత్రం చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రభాస్ ఈ చిత్రం మీద దృష్టి సారించారు. పూణే వద్ద లావసా అనే ప్రాంతంలో అనుష్క మరియు ప్రభాస్ ల మీద ఒక పాటను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రేమకి, స్నేహానికి మధ్యలో వారధిగా నిలిచిన యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో పాటలు మరియు ఫైట్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని చిత్ర వర్గాల సమాచారం. వి వంశీ కృష్ణ మరియు ప్రమోద్ ఉప్పలపాటి ఎం వి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు.

Exit mobile version